వారానికి రెండు సార్లు బీర్లు తాగుతా..రాయడం బర్డెన్ గా అనిపించి వచ్చేసా
on Feb 4, 2025
చాలామంది ఇండస్ట్రీకి రాగానే చెడు అలవాట్లకు ఎక్కువగా బానిసలవుతూ ఉంటారు. కానీ చమ్మక్ చంద్ర మాత్రం వాటికి చాలా దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. అలాగే చాలా విషయాలు కూడా చెప్పాడు. "మొదట్లో నాకు మందు అలవాటు అన్నది లేదు. కానీ నాలుగేళ్ల నుంచి బీర్లు తాగే అలవాటు అయ్యింది. వారానికి రెండు సార్లు బీర్లు తాగుతూ ఉంటా, అంటే టు డేస్ సిట్టింగ్ డే 5 డేస్ డైట్. కొంతమంది మందు అలవాటు చేసుకుని కెరీర్ ని నాశనం చేసుకున్న వాళ్ళను చూసాను. అందుకే నాకు చాలా భయం.
అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నా. లిమిట్ దాటుతున్న అంటే నాకు నేను అలెర్ట్ అవుతాను. పబ్బులకు వెళ్లాలంటే భయం. నా గోల్ డీవియేట్ అవుతుందని భయం. అందుకే జబర్దస్త్ లోని వాళ్ళను వాళ్ళ పిల్లలను నేనే ఇంటికి పిలిచి వండి పెడుతూ ఉంటాను. అదే ఎంజాయిమెంట్. నేను ధన్ రాజ్, తాగుబోతు రమేష్ ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఏ ఫంక్షన్ ఐనా కానీ మేమె ఎక్కువగా వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా ఆలోచిస్తే ఒక్కటే ఆలోచించే వాడిని. ఆరోజున టీమ్ లీడర్ గా ఛాన్స్ మిస్ చేసుకుని ఉంటె నా పరిస్థితి ఏమిటా అనుకుంటూ ఉంటాను. నేను అప్పటికప్పుడు తయారు చేసే స్కిట్ ని అసలు చేయలేను. వన్ వీక్ ముందే నేను స్కిట్ రాసుకుంటా. అలా ఉంటే నేను స్కిట్ చేయగలుగుతాను. రాయడం కొంచెం బర్డెన్ గా అనిపించి నేను జబర్దస్త్ నుంచి వచ్చేసా" అని చెప్పాడు చమ్మక్ చంద్ర.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
